May 27,2023 22:24

కందుకూరి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న నాయకులు

- సిపిఎం నివాళి
ప్రజాశక్తి - కాకినాడ
కందుకూరి వీరేశలింగం ఒక సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ వ్యాసారంగంలో ఎక్కువగా కషి చేశారనిఈ సిపిఎం, ప్రజా సంఘాల అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో శని వారం స్థానిక సుందరయ్య భవన్‌లో కందుకూరి వీరేశలింగం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా నాయకులు కెఎస్‌ శ్రీనివాస్‌, దువ్వ శేష బాబ్జి, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నవయుగ వైతాళికుడని, వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టేవారన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్త రాజశేఖర్‌, కరణం ప్రసాదరావు, ప్రజా సంఘాల నాయకులు సిహెచ్‌ రమణి, సిహెచ్‌ అజరు కుమార్‌, జిత్తుగ శ్రీనివాస్‌, పి.వీరబాబు, టి రాజా, సిహెచ్‌ రాజ్‌ కుమార్‌, కే వీరబాబు, రెడ్డి, కె. సింహాచలం తదితరులు పాల్గొన్నారు.