Apr 01,2023 20:39

ఆలయ చరిత్రను వివరిస్తున్న పురోహితులు

సంగమేశ్వరంలో తెలంగాణ హైకోర్టు జడ్జి

ప్రజాశక్తి - కొత్తపల్లి

సప్తనదుల సంగమ తీరంలో వెలసిన సంగమేశ్వర క్షేత్రంలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సాంబ శివ నాయుడు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ పూర్ణకుంభంతో చీఫ్‌ జస్టిస్‌ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం సంగమేశ్వర ఆలయంలో ఉన్న వేపదారు శివలిం గానికి పూజలు నిర్వహించారు. అలాగే పురోహితులు జడ్జికి ఆలయ విశిష్టత వివరించారు.