Aug 23,2023 19:54

త్వరలో పరామర్శకు రానున్న లోకేష్‌
తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి
ప్రజాశక్తి - ఆకివీడు

              ఇటీవల దారుణ హత్యకు గురైన సంధ్యారాణి బిడ్డకు, ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ సిరిగిరి రాజ్యలక్ష్మి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆమె హత్యకు గురైన సంధ్యారాణి తల్లిదండ్రులను, బిడ్డను పరామర్శించారు. అనంతరం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. తల్లిదండ్రులకు నిందితుడి వల్ల హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సంధ్యారాణి కుమారుడి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వాలని ఆమె కోరారు. సంధ్యారాణి తల్లిదండ్రులను, బిడ్డను పరామర్శించేందుకు త్వరలో తమ పార్టీ నాయకుడు నారా లోకేష్‌ రానున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతో పాటు టిడిపి నాయకులు, మండల తెలుగు మహిళ సరళ, కౌన్సిలర్‌ బొల్లం వీర శ్వేత, పార్టీ పట్టణ అధ్యక్షులు బల్ల వెంకట్రావు ఉన్నారు.