ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న పుస్తక మహోత్సవ్‌లో శనివారం సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు, సందర్శకులు పాల్గొన్నారు. పుస్తక మహోత్సవ్‌కు ఆదివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు పాల్గోనున్నారు. శనివారం సాయంత్రం పుస్తక మహక్షత్సవ్‌లోని సాహత్య వేదికపై పలు సాహిత్య కార్యక్రమాలు జరగ్గా ప్రతిభా వేదికపై విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సాహిత్య వేదికపై అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానం - మాతృభాషలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర ఆచార్యులు ఆచార్య జోగాసింV్‌ా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుభాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సాహిత్య వేదికపై తెలుగు సాహిత్యం డిజిటీకరణ - గ్రంథాలయాలు అనే అంశంపై జరిగిన సదస్సుకు రహమనుద్దీన్ అధ్యక్షత వహించగా మనసు ఫౌండేషన్ నుండి ఎం.వి. రాముడు , గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.శేషగిరిరావు, అనంతపురంకు చెందిన వైద్యులు డాక్టర్ గేయానంద్ పాల్గొని ప్రసంగించారు. ఆదివారం పుస్తక మహోత్సవం ముగింపు సభ సాయంత్రం 6 గంటలకు గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కలెక్టర్ డిల్లీరావు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండరీకర్, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా హాజరుకానున్నారు.
విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి
ప్రతి విద్యార్థి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని తద్వారా అవి జీవితానికి బాటలు వేస్తాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్‌కుమార్ అన్నారు. పుస్తక మహోత్సవంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాలును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన కళాకృతులు, రోబోటిక్స్, జగనన్న విద్యాకానుక కిట్, బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు వంటివి పరిశీలించి విద్యార్థులను అభినందించారు. గంపలగూడెం కేజీబీవీ విద్యార్థినులు ప్రదర్శించిన నత్యాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్ట్ నిర్వాహకులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య పాల్గొన్నారు.










