Jan 16,2023 22:15

ప్రజాశక్తి-భవానీపురం: భవానీ ఐలాండ్‌లో గత ఆరు రోజులుగా టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల నేపధ్యంలో సోమవారం కనుమ పండుగ రోజున రాష్ట్ర పర్యాటక సాంస్కతిక క్రీడలు, యువజనాభివద్ది శాఖా మంత్రి మంత్రి ఆర్‌కె రోజా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ టూరిజం లక్ష్యం పర్యాటక కార్యకలాపాలను మెరుగుపరచడం, రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింతగా పెంచాలని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివద్ధికి బాధ్యతాయుతమైనది పర్యాటక రంగం అన్నారు. విజయవాడ పరిసరాల్లో, భవానీ ద్వీపం అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశమని తెలిపారు. భవానీ ద్వీపంలో సంక్రాంతి సందడిని నిర్వహించడం అనేది ఆచారాలు, సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి నేటి తరాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక అద్భుతమైన కార్యక్రమమని తెలిపారు. సాంప్రదాయ గ్రామాన్ని అనుభవించడానికి గ్రామ వాతావరణం సష్టించబడి, ఇక్కడ. సంక్రాంతి అనేది గ్రామీణ గ్రామంలో జరుపుకునే పండుగ అన్నారు. సందర్శకులను ఆకర్షించడానికి, ఈవెంట్‌లో పాల్గొనేలా వారిని ప్రోత్సహించడానికి అనేక కార్యకలాపాలు రూపొందించబడ్డాయని చెప్పారు. కోలాటం, శాస్త్రీయ నత్యాలు, బుర్ర కథలు, గానం, హరిదాసులు, గంగరెద్దులు, కుండల తయారీ, జానపద నత్యం, జానపద గానం, గాలిపటం ఎగురవేయడం, బోనాఫైర్‌, హైదరాబాద్‌తో సహా ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుండి, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి ప్రజలు దీనిని ఇష్టపడుతున్నారని చెప్పారు. పిల్లలు, విద్యార్థులు గానం, నత్యం, వ్యాస రచన, డ్రాయింగ్‌, సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారన్నారు. గత ఐదు రోజులుగా పది వేల మంది ప్రజలు సంక్రాంతిలో పాల్గొనేందుకు ద్వీపాన్ని సందర్శించినట్లు ఆమె తెలిపారు. ప్రజాశక్తి-వన్‌టౌన్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక 48వ డివిజన్‌లో చిచ్చా బ్రదర్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు, సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 48వ డివిజన్‌లో చిచ్చా బ్రదర్స్‌ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొంది ప్రథమ బహుమతి సాధించిన ఐదుగురికి, రెండో బహుమతి సాధించిన 15 మందికి, మూడో బహుమతి సాధించిన వారికి 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ అత్తులూరి ఆదిలక్ష్మి చేతుల మీదుగా సోమవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిళ్లా జగ్గు, అయితా కిషోర్‌, కోళ్ల రజిని, అత్తలూరు పెద్దబాబు, లక్ష్మి, వరలక్ష్మి, దుర్గారావు, బాయన అమర్నాథ్‌, నాగు, ఆర్‌. శ్రీను, జాని, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని పాతపేట గడ్డ వద్ద ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. టిడిపి జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, జగ్గయ్యపేట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను స్వగృహం వద్ద సంక్రాంతి సంబరాలను విమలభాను ఫౌండేషన్‌ చైర్మన్‌ సామినేని విమలభాను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భావితరాలకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పే విధంగా ఇలాంటి వేడుకలు జరుపుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ అన్ని వర్గాల ప్రజలలో నూతన ఉత్సాహాన్ని నింపడం సంతోషమన్నారు. తెలిపారు. చిన్నారుల సాంప్రదాయ నత్యాలు, చిన్నారులకు భోగి పండ్లు, భోగిమంటలు, రంగవల్లుల కార్యక్రమం, గంగారెద్దుల విన్యాసం, హరిదాసుల సంకీర్తనలు, జడ కోలాటాల బందనాట్యాలు, సాంప్రదాయ నృత్యం, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాశక్తి-నందిగామ: సంక్రాంతి సంబరాల్లో భాగంగా దేవినేని వెంకట రమణ యూత్‌ మరియు గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తోటరావులపాడు గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని) పాల్గొన్నారు. ముందుగా నందిగామ పట్టణ బైపాస్‌ చందాపురం రోడ్డులో నానికి టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చందాపురం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు వినోద్‌ ఇంటికెళ్లి వారి కుమార్తెను ఆశీర్వదించారు.