Mar 05,2023 18:20

పశువులకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ ఎం.కేజియా

సంచార పశు వైద్యసేవలను వినియోగించుకోండి
ప్రజాశక్తి - పగిడ్యాల

     వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవలను పశు పోషకులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్‌ పశు వైద్యాధికారి డాక్టర్‌ కేజియా అన్నారు. ఆదివారం మండలంలోని ఎం ఘణపురం గ్రామంలో పశువులకు ఆమె చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఘణపురం గ్రామంలో బర్రెకు పొదుగు వాపు రావడంతో యజమాని ఈశ్వరమ్మ 1962కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో వచ్చి చికిత్స చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులో ఉన్నా సమాచారం అందిస్తే పశువు పరిస్థితిని బట్టి ఇక్కడే చికిత్స అవసరమైతే ఉన్న చోటే చికిత్స చేస్తామన్నారు. లేదా వాహనంలో నందికొట్కూరు తరలించి మెరుగైన చికిత్స చేస్తామన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో వైస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు రెండు ఉన్నాయని, రైతులు, పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.