Aug 29,2023 23:46

ప్రజశక్తి - చీరాల
సంచార జాతుల కులాలను రాజ్యాంగంలో చేర్చి తమ జాతి ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సంచార జాతుల జిల్లా అధ్యక్షులు కత్తుల దుర్గారావు కోరారు. ఈనెల 31న రాజమహేంద్రవరంలో జాంపేట ఆనంద్ కన్వేషనల్ హలులో జరుగుననున్న భారత దేశ విముక్తి సంచార జాతుల 71వ స్వతంత్ర దినోత్సవం 7వ వార్షికోత్సవ రాష్ట్ర సభను జయప్రదం చేయాలని కోరారు. సంచార జాతుల వ్యవస్థాపకులు, ఎపి కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న సంచార జాతుల కులాలను రాజ్యాంగంలో చేర్చాలని, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని విధాల వెనుకబడిన తమ జాతిని సిఎం వైఎస్‌ జగన్‌ గుర్తించారని అన్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలు వివరించేందుకు జాతి ప్రజలు ముందుకు రావాలని కోరారు. చీరాల, వేటపాలెం మండలాల్లోని సంచార జాతుల కులాల నాయకులను, మహిళలను కలిసి మహాసభల కర పత్రాలు పంపిణీ చేశారు. సభకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సంచార జాతుల చీరాల మండల నాయకులు కత్తుల లక్ష్మయ్య, కత్తుల ముసలయ్య, పసుపులేటి శ్రీనివాసులు, పసుపులేటి వెంకట్రావు, పొగడ్త ఆంజనేయులు, ప్రసాదం రాంబాబు, పసుపులేటి లక్ష్మి, కత్తుల ఏడుకొండలు, పసుపులేటి సత్యనారాయణ, జంగాలపల్లి వెంకయ్య, కత్తుల బసవయ్య, పసుపులేటి వీరస్వామి, వేటపాలెం మండల నాయకులు జక్కుల పెదనాగేశ్వరరావు, పసుపులేటి భాస్కరరావు, కత్తుల దుర్గయ్య, కత్తుల కోటయ్య, కత్తుల ఆంజనేయులు, జక్కుల సుబ్బారావు, బొజ్జ అంకమ్మరావు, పరుశురాం పాల్గొన్నారు.