Oct 29,2023 21:14

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సంచార జాతులకు వారివారి కులవృత్తులలో నైపుణ్యం పెంచుకోని కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందాలని డి-నోటిఫైడ్‌, సంచార, సెమీ సంచార కమ్యూనిటీల అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు భరత్‌భారు బాబుభారు పట్నీ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం చిత్తూరు పట్టణంలోని ప్రైవేట్‌ కళ్యాణ్‌ మండపంలో జిల్లాలోని సంకరజాతుల కులాలవారి అభివృద్ధి కొరకు నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల కులగణన చేయాలి, ఎంబిసి కార్పోరేషన్‌ ద్వారా సంచార జాతుల వారికి రుణాల మంజూరు చేయాలని, సంచార జాతుల వారికి గృహనిర్మాణంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో సంచార జాతుల కులాలు వారి వృత్తి నైపుణ్యంను పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పిల్లలందరినీ చదివించుకుని కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, విశ్వకర్మ యోజన పథకంను అర్హులైన పెద్ద కుటుంబాలు ఉపయోగించుకోని అభివృద్ధి చెందాలన్నారు. సంచార జాతుల జీవన విధానంలో మార్పులు తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ముఖ్యఉద్దేశమని తెలిపారు. శనివారం తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాలందు పర్యటించి సంచార జాతుల్లో వారి జీవనవిధానం వారి సాధకబాధలను వారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఆములు పరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వారికి వివరించడం, కేంద్ర ప్రభుత్వం అందజేసి సంక్షేమ ఎలాపొందాలన్న వివరాలను వివరించడం జరిగిందన్నారు. ఇక్కడ సంచార జాతుల స్థితిగతులు తెలుసుకోవడం జరిగిందని దీనికి సంబంధించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర, నాయకులు వెంకటేశ్వర్లు పి.కుమార్‌ మహీంద్ర, చిత్తరంజన్‌, డోలకృష్ణ, డాక్టర్‌ ఫణీంద్ర, మధుసూదన్‌, జయలక్ష్మి, సంచార జాతుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.