Dec 21,2022 23:48

నిరాశ్రయులకు దుప్పట్లు అందజేస్తున్న మేయర్‌ గొలగాని,

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం వైసిపి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జన్మదిన కేక్‌ను కట్‌ చేసి, జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాలు, వృద్ధులు, అనాధలకు దుప్పట్లు, బట్టలు, మహిళలకు చీరలు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ, అన్నసమారాధనలు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.
గాజువాక. : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు, బట్టల, దుప్పట్లు పంపిణీ చేశారు. దొడ్డి రమణ ఆధ్వర్యంలో నడుపూరులో పేదలకు చీరలు పంపిణీ చేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. 87వ వార్డు పరిధి వడ్లపూడి వైసిపి కార్యాలయంలో నేతలు దానప్పలు, దామోదర్‌ పాల్గొని చీరలు, పండ్లు పంపిణీ చేశారు.
భీమునిపట్నం : నాలుగోవార్డు మంగమారిపేటలో వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు ఆధ్వర్యంలో 300 మంది వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఒకటో వార్డు, చిట్టివలస బంతాట మైదానంలో రక్తదాన శిబిరాన్ని వైసిపి నియోజకవర్గ పరిశీలకులు పి.బాలరాజు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, పార్టీ వార్డు అధ్యక్షులు జగుపిళ్ల ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్లు ఉప్పాడ నాగేశ్వరరావు, జివి రమణ, తమ్మిన అశోక్‌ పాల్గొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి దంతులూరి వెంకటశివ సూర్యనారాయణరాజు, అతని స్నేహితుల ఆర్థికసాయంతో సమకూర్చిన నాలుగు వీల్‌చైర్లను నలుగురు వికలాంగులకు అందజేశారు. జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌
డి పెద బాబు, ఎంపిడిఒ పి వెంకటరమణ, పొట్నూరు చంద్రశేఖర్‌, గాడు శ్రీను పాల్గొన్నారు. టి నగరపాలెంలో సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
పద్మనాభం: మండల కేంద్రంలోఎంపిపి కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో సిఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా భారీకేక్‌ను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కట్‌ చేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలు సిహెచ్‌ స్వాతి, కె.వెంకటలక్ష్మి, ఎం.పూజితలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కస్తూర్బా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మెగా రక్తదానశిబిరంలో 80మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు..
ఆరిలోవ : సిఎం జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని 11వ వార్డు అమ్మా నాన్న ట్రస్టు ఆధ్వర్యంలో, వైసిపి సీనియర్‌ నేత ఇజ్జాడ సత్యనారాయణ, సర్యప్రభ దంపతుల సహకారంతో జివిఎంసి నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులకు మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని ఆందించారు. వైసిపి నేత గొలగాని శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, బిసి సెల్‌ అధ్యక్షులు బోని శ్రీను పాల్గొన్నారు.
13వ వార్డు, ఆరిలోవ కాలనీలో వైసిపి రాష్ట్ర వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు వానపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పాల్గొని సిఎం జగన్‌ జన్మదిన కేక్‌ను కట్‌ చేసారు. పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేసారు. వైసిపి నేతలు గూడపాటి విక్టర్‌, బాలరాజు, వెంకట్‌, పారిపల్లి రామారావు, సత్యాల సాగరిక పాల్గొన్నారు.
13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత ఆధ్వర్యంలో... ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు వద్ద గల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్ధులతో కలిసి సిఎం జగన్‌ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి విద్యార్ధులకు పంచిపెట్టారు. వార్డు ఇన్‌ఛార్జి కెల్ల సత్యనారాయణ, శిరీషా, వెంకటరెడ్డి, గోవిందు, బాబూరావు పాల్గొన్నారు.
సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో సమన్వయకర్త కెకె.రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్‌ జన్మదిన వేడుకలు పండుగను తలపించాయి. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, పార్టీజిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, మారిటైం బోర్డు చైర్మన్‌ కాయ వెంకటరెడ్డితో కలిసి కెకె.రాజు కేక్‌ కట్‌ చేశారు. రక్తదాన శిబిరంలో కెకె.రాజుతోపాటు యువకుల స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పేదలకు బట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నేత బొడ్డేటి కాశీవిశ్వనాథం, కార్పొరేటర్లు చొక్కాకుల లక్ష్మి వెంకటరావు పాల్గొన్నారు.
సీతమ్మధార : ఎపి యాత వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిల్లి సుజాత ఆధ్వర్యంలో విశాఖలోని ఆమె స్వగృహంలో జగన్‌ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యాత సంక్షేమ, సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షులు పిల్లి నూకరాజు, పోలవరపు అప్పారావు, పూడి అప్పారావు, పూడి సంజీవి, గొంప అప్పలరాజు, బత్తిన బంగార్రాజు, కుప్పా మురళి, కుప్పా మోహనరావు, పోలవరపు ప్రసాదు, లావేటి రాజు, లావేటి హేమసుందర్‌, సంపంగి మంగరాజు వైస్‌ ప్రెసిడెంట్‌ బసరమని ఈశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గొడ్డు కన్నారావు పాల్గొన్నారు.
మధురవాడ : ఎనిమిదవ వార్డు సాగర్‌నగర్‌ బీచ్‌రోడ్డులోని అంథుల పాఠశాలలో వార్డు అధ్యక్షుడు గుడ్ల పోలిరెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్‌ జన్మదిన వేడుకలు సందర్భంగా వార్డు కార్పొరేటర్‌ లొడగల అప్పారావు పాల్గొని, కేక్‌ కట్‌ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో చెన్నా ఎల్లయ్య పాల్గొన్నారు.
5వ వార్డు మారికవలస రాజీవ్‌ గృహకల్ప కల్యాణ మండపంలో సిఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైసిపి ఎన్నికల సలహాదారు పసుపులేటి బాలరాజు పాల్గొని వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతరావుఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 7వ వార్డు మధురవాడ పిహెచ్‌సి వద్ద పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు
పెందుర్తి : 96వ వార్డు పెందుర్తిలో ఎన్నికల పరిశీలకులు శరగడం చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో సిఎం జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. క్రికెట్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. 94వ వార్డు నాయుడు తోట దరి అప్పలనరసయ్యకాలనీలోని వైసిపి కార్యాలయంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ, వైసిపి నగర ప్రతినిధి వై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి నేతలు కంచిపాటి జగదీష్‌, ఆవగడ్డ సోమునాయుడు, పాల్గొన్నారు
సింహాచలం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 98వ వార్డు వైసిపి అధ్యక్షులు కొలుసు ఈశ్వరరావు, ఎర్రవరం బాబు ఆధ్వర్యంలో సింహాచలం తొలిపావంవా వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.కార్యక్రమంలో కర్రి సత్తిబాబు, దొంతల సంతోష,్‌ పీతల అప్పలరాజు పాల్గొన్నారు.
కంచరపాలెం : సిఎం జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని 49వ వార్డు పట్టాభిరెడ్డి గార్డెన్స్‌ దరి వానప్రస్థ వద్ధాశ్రమంలో 14వ వార్డు కార్పొరేటర్‌ అనిల్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు పాల్గొని కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు ఇచ్చారు. అన్నదానం చేశారు. 15 లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ గీజర్‌ను ఆశ్రమం నిర్వాహకులకు అందజేసారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మెంబెర్‌ సంపంగి శ్రీను, ఆదిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.
క్రికెట్‌ విజేతలకు బహుమతుల పంపిణీ
కంచరపాలెం : సిఎం జగన్‌ జన్మదినం సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు ఆధ్వర్యంలో కౖలాసపురం డిఎల్‌బి గ్రౌండ్‌లో నిర్వహించిన జెఎంఆర్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ విజేతలకు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్‌, వైసిపి జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి కెకె.రాజు నగదు బహుమతిని అందజేసారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ.రెహమాన్‌, వికెపిసిపిఐఆర్‌ చైర్‌పర్సన్‌ చొక్కాకుల లక్ష్మీ వెంకటరావు, మాధవి వర్మ, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, బాణాల శ్రీనివాస్‌ రావు, కంపా హనోక్‌,అల్లు శంకరరావు, బర్కత్‌ ఆలీ, అనిల్‌ కుమార్‌రాజు, సాడి పద్మ రెడ్డి, ఆళ్ళ లీలవాతీ, ఉషశ్రీ, కంటిపాము కామేశ్వరి, వి.ప్రసాద్‌, రెయ్యి వెంకట్‌ రమణ, కెవిఎన్‌. శశికళ, పేడాడ రమణికుమారి, బి.కాశీవిశ్వనాధం పాల్గొన్నారు.
ఎంవిపి కాలనీ : మద్దిలపాలెం కృష్ణా కాలేజ్‌ రోడ్డులోని వైసిపి కార్యాయంలో 53వ వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ ఆధ్వర్యాన కేక్‌ కట్‌ చేశారు. వైసిపి జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు. అనంతరం ఎపిఐఐసి డైరెక్టర్‌ మొల్లి అప్పరావు నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించి 250 యూనిట్లు రక్తం సేకరించారు.
ఎంవిపి.కాలనీలోని వైసిపి కార్యాలయంలో అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యాన రక్తదానం శిబిరం నిర్వహించారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి పాల్గొన్నారు. శివాజీ పాలెంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ ఆధ్వర్యాన కేక్‌ కట్‌ చేశారు. టిఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ నైట్‌ షెల్టర్‌లోని నిరాశ్రయులకు సింహాద్రి అప్పన్న ప్రచార సమాఖ్య సమన్యకర్త సనపల నారాయణస్వామి చీరలు పంపిణీ చేశారు. లా సన్స్‌ బే కాలనీ శాంతి ఆశ్రమంలోని డెప్‌ స్కూల్లో వైసిపి మహిళా నేత రమ్యశ్రీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.