ఎంఇఒను సన్మానిస్తున్న సర్పంచి, ఛైర్మన్
ప్రజాశక్తి - కోసిగి రూరల్
సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎంఇఒ-2 నాగేశప్ప హెచ్చరించారు. బుధవారం మండలంలోని దుద్ది, చిర్తనకల్, మూగలదొడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, దుద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న విద్యా కానుక, నాడు-నేడు పనులను, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రార్థన సమయం కంటే 15 నిమిషాలు ముందు హాజరు కావాలని సూచించారు. అనంతరం చిర్తనకల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్, సర్పంచి ఆధ్వర్యంలో నాగేశప్పను సన్మానించారు. క్లస్టర్ సిఆర్‌పి యోహాన్ పాల్గొన్నారు.










