Sep 19,2023 21:14

మహిళకు బుక్‌లెట్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే

వల్లూరు :గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు త్వరిత గతిన పరిష్కరించాలని కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వల్లూరు మండల పరిధిలోని తపెట్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి. ఎమ్మెల్యే పి .రవీంద్రనాథ్‌ రెడ్డి. యువనేత నరేన్‌ రామాంజులరెడ్డి. కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో వివరిస్తూ బుక్‌ లేట్‌ అందించారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి వెంకటసుబ్బయ్య, మాజీ జడ్‌పిటిసి అబ్బిరెడ్డి వీరారెడ్డి, రఘునాథ రెడ్డి , కె. బాల మైసురారెడ్డి, తహశీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపిడిఒ జుబేదా, ఎంఇఒ లిల్లెమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.