సమస్యలు ఉంటే చెప్పండి... జడ్జి
హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచండి
ప్రజాశక్తి కొత్తపల్లి
కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు సమస్యలు ఉంటే అధికారులకు చెప్పాలని హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన కొత్తపల్లి లో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు సమస్యలు లేకుండా చదువుకోవాలి అన్నారు. సమస్యలు వస్తే ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కరించుకునే విధంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉంటున్న బాలికలందరూ మంచి ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలి అన్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను అపరిశుభ్రంగా ఉండనీయకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని సంబంధిత అధికారికి తెలియజేశారు. విద్యార్థులకు ఇస్తున్న భోజనం ప్రభుత్వ మెను ప్రకారం ఇవ్వాలి అన్నారు. తన సొంత పిల్లలకు ఏ విధంగా అయితే భోజనం పెడతామో అదేవిధంగా భోజనం ఇవ్వాలన్నారు. అనంతరం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటుచేసి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఇన్చార్జి ఎస్ఐ రామ్నాథ్ న్యాయవాదులు నాగేష్ మాణిక్యరావు రంగస్వామి హుస్సేన్ మియా ఏ ఎస్ ఐ బాబా ఫక్రుద్దీన్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.











