Nov 06,2023 21:15

ప్రజాశక్తి - భీమవరం
స్పందన సమస్యలకు కచ్ఛితమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలలా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను డిఆర్‌ఒ కృష్ణవేణి, కెఆర్‌సిసి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బిఎస్‌.నారాయణరెడ్డి, పీడీ హౌసింగ్‌ డాక్టర్‌ ఆర్‌సి.ఆనంద్‌ కుమార్‌, పిడిడిఆర్‌డి ఎఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, సిఐ జివిఎస్‌ పైడేశ్వరరావు 224 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ కృష్ణవేణి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు మళ్లీ రీఓపెన్‌ అవ్వని విధంగా కచ్ఛితమైన పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వయోవృద్ధులు ట్రిబ్యునల్‌ మెంబరు మేళం దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.