ప్రజాశక్తి - ఆదోని
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని సిఆర్.నగర్, పంజరాపోల్, బిఎస్ లాడ్జి ప్రాంతాల్లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి గడపకూ తిరుగుతూ వార్డులో మురుగు కాలువలు, వీధిలైట్లు, రోడ్లు, కల్వర్ట్‌లను పరిశీలించారు. ఇంతవరకు పథకాలు అందని వారికి వెంటనే నవరత్నాలు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల్లో తిరుగుతున్నప్పుడే వారి సమస్యలు తమకు అర్థమవుతాయని, ప్రతి పేదవాడీ కష్టాలు తెలుసుకోగలుగుతున్నామని వివరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీరు రాజశేఖర్ రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, మురళీ రెడ్డి, వార్డు ఇన్‌ఛార్జీ ఎర్రి స్వామి, కామాక్షి తిమ్మప్ప, చంద్రశేఖర్ రెడ్డి, రామ్ లింగేశ్వర్, ఎంఇలు, సచివాలయ సిబ్బంది, స్టేట్ డైరెక్టర్లు రేణుక, మంజుల, శ్రీలక్ష్మి, జులేఖ, శ్రీదేవి, రవి, తాయన్న, బికె.లక్ష్మన్న, నాగరాజ్, లక్ష్మీనారాయణ, రైల్వే ఈరన్న, లాల్ బాషా, జహీర్, రాయ నగర్ చిన్న ఈరన్న, కాంట్రాక్టర్ వీరేష్, లాలప్ప ఉన్నారు.
సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి










