ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :ఎమ్మెల్సీ ఓటు నమోదు కొరకు స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ భవాని శంకర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్‌లోని అన్ని మండలాల తహిశీల్దారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. డివిజన్ లోని రెవెన్యూ సమస్యలు, ఎమ్మెల్సీ ఓటు నమోదు కొరకు పలు సూచనలు చేశారు. స్పందనలో వచ్చిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యలును పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలని సూచించారు. డిగ్రీ, ఇంజనీరింగ్, డిగ్రీకి సమానమైన డిప్లొమా, ఓపెన్ డిగ్రీ, ఎం.బి.బి.ఎస్, అగ్రికల్చర్, ఆయుర్వేదిక్, డిగ్రీ పట్టభద్రుల ఓటర్లు నమోదుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రాడ్యూయేట్ ఓటరుగా నమోదుకు నవంబర్ 7 వరకు మాత్రమే ఉందన్నారు. గతంలో ఉన్న ఓటరు లిస్టు రద్దు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదు చేసుకోవాలని అందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు.










