Nov 16,2022 00:01

ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఒబి నిర్వాసితులు

ప్రజాశక్తి -రాంబిల్లి
సమస్యలను పరిష్కరించకుంటే తక్షణమే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేవల్‌ బేస్‌ నిర్వాసితుల జెఎసి నాయకులు స్పష్టం చేశారు. నేవీ మెయిన్‌ గేట్‌ ముందు ప్రత్యామ్నాయ నావికా స్థావరం (ఎన్‌ఎఒబి) నిర్వాసితులు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వేలాదిమంది నిర్వాసితులు గేట్‌ ముందు రోడ్డుపై బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ నేవీ గేట్‌లు వెంటనే తీయాలని, ఆధార్‌ కార్డు ఆధారంతో లోనికి పంపించాలని, జెట్టీ నిర్మాణం వెంటనే చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్యాకేజీలు వెంటనే క్లియర్‌ చేయాలి, మగవాళ్లతో సమానంగా మహిళలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని, నేవల్‌ బేస్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది నిర్వాసితులు పాల్గొన్నారు.