Jul 17,2023 22:47

  • ఆర్‌టిసి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మిక సంఘం

ప్రజాశక్తి-విజయవాడ: ఎపిఎస్‌ఆర్‌టిసిలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవ్వాల్సి వస్తోందని ఆర్టీసి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌.నూర్‌అహ్మద్‌ హెచ్చరించారు. స్థానిక బిఆర్‌టిఎస్‌ రోడ్డులోని ఎన్‌పిఆర్‌ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసి సంస్థ విడుదల చేసిన సర్య్కులర్‌ ప్రకారం వేతనాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులతో కుమ్మక్కై ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు కూడా ప్రతి నెలా సక్రమంగా ఇవ్వట్లేదని అన్నారు. ఈఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి వాటిలో కూడా అక్రమాలకు పాల్పడుతూ సరిగ్గా అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడ నగర నూతన కమిటీ ఏర్పాటైంది. గౌరవ అధ్యక్షులుగా యం.బాబురావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఐ.సంజు, బి.మాధవ, కోశాధికారిగా ఏ.జి.రాయుడు, సహాయ కార్యదర్శులుగా టి.శివకుమార్‌, ఎస్‌.చైతన్య, యం.విజయరాజు, వి.దేవేంద్ర, ఉపాధ్యక్షులుగా జి.విష్ణు, యం.శ్రీనివాస్‌, ఎస్‌.రాజేష్‌, ఎ.అనంతసాయి, కమిటీ సభ్యులుగా టి.గోపి, ఎ.రవీంద్ర, సిహెచ్‌.నరేంద్ర, ఎం.వి.డి ఆంజనేయులు, కె.ఎన్‌.వి.దుర్గారావు, పి.ప్రవీణ్‌, సిహెచ్‌.పవన్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.