
నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
ప్రజాశక్తి మడకశిర: తమ సమస్యలు పరిష్కరించేదాకా దశలవారీగా ఆందోళనలు చేపడతామని తాగునీటి పథకం కార్మికులు, సిఐటియు నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం యూనియన్ హిందూపురం డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారానికి 9వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని శ్రీరామి రెడ్డి తాగునీటి పథకం కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.