Aug 29,2023 22:22

నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : తాగునీటి పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె కొనసాగిస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ పేర్కొన్నారు. మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న శ్రీరామిరెడ్డి కార్మికులు సమస్యలపై మడకశిర ఆర్డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద జనరల్‌ బాడీ సమావేశాన్ని సుబ్బరాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మడకశిర ప్రాంతంలో ఉన్న కార్మికులకు 14నెలల పిఎఫ్‌ ఇవ్వాలన్నారు. ఒకే ప్రాజెక్టుకు రెండు రకాల వేతనాలు ఇస్తూ కాంట్రాక్టర్‌ యల్‌ . కె. నాయుడు కార్మికులను మోసం చేశారన్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే సూపర్వైజర్లు ప్రసాదు, నాగరాజు వేధింపులు అధికమయ్యాయని విమర్శించారు. కార్మికులపై వేధింపులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. హిందూపురంలో కార్మికులకు 14 నెలలు పి.ఎఫ్‌ బకాయిలు చెల్లింలేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సమ్మెకొనసాగిస్తామని అన్నారు. అనంతరం శ్రీరామిరెడ్డి తాగునీటి పంప్‌హౌస్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌, వన్నూరప్ప, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు రామాంజినేయులు. శ్రీరామిరెడ్డి యూనియన్‌ మడకశిర డివిజన్‌ ఉపాధ్యక్షులు మారుతి, కోశాధికారి కిష్టప్ప, పాతప్ప తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లై లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు మధుసూదన్‌, సత్యసాయి వాటర్‌ సప్లై అధ్యక్షులు రాము డిమాండ్‌ చేశారు. కొత్తచెరువు లోనే ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న వాటర్‌ సప్లై పంపు వద్ద మంగళవారం నిరసన తెలిపి అక్కడనుండి పేకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుక్కపట్నం చెరువులోకి వెళ్లి అర్ధనగంగా నిరసన తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్‌ శంకర దాదా, పీర్‌ సలీం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు
బత్తలపల్లి : సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.మంగళవారం బత్తలపల్లిలో సత్యసాయి కార్మికులు ఐదవ రోజున వినూత్న నిరసన చేపట్టారు. పలువురు కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దున్నపోతుకందించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని దున్నపోతులకు వినతిపత్రం అందచేసినట్లు కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి జగన్‌ మారుతి, బాషా, జయరాం, కేశవ్‌, సద్గురు రామ్‌ మెహన్‌, సిద్దయ్య, బాబు, కార్మికులు పాల్గొన్నారు.