
హిందూపురం : నీలకంఠపురం వాటర్ వర్క్స్‌లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రశక్తే లేదని, అవసరమైతే నిరవధికదీక్షకు సిద్ధం అవుతామని కార్మికులు పేర్కొన్నారు. జిల్లాలో మడకశిర, హిందూపురం డివిజన్‌లలోని శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు నీటి సంపు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నీటి సరఫరాలో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలు ఉన్న ఐదు నెలల వేతనాలు, పిఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత నెల 29 నుంచి సమ్మె చేస్తున్నామన్నారు. కార్మికులకు ఇస్తున్న వేతనంలో ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం కాకుండా రూ.2500 తగ్గించి కాంట్రాక్టర్ ఇస్తున్నారన్నారు. మరి కొందరికి ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వేతనంలో కోతతో పాటు 18 నెలల పిఎఫ్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న అధికారుల్లో, కాంట్రాక్టర్‌లో కనీస చలనం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిటియు నాయకులు ఓబులన్న, కార్మిక సంఘం అధ్యక్షులు కెఎల్.సోమశేఖర్, ఉపాధ్యక్షులు జి.మంజునాథ్, కార్యదర్శి నారాయణప్ప, ట్రెజరర్ బాలకష్ణ, పరిగి ఉపాధ్యాయులు ఎం.రామాంజనప్ప తదితరులు పాల్గొన్నారు.