Aug 10,2023 20:37

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ

 రాయచోటి టౌన్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తెలిపారు. విద్యా రంగ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎస్‌ఎఫ్‌ఐ జండాతోనే పోరాటం చేయాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని విద్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని పేర్కొన్నారు. జిల్లాలో యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో రెగ్యూలర్‌ అధ్యాపకులు లేరని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మూడేళ్ల నుండి పెండింగ్‌ ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయలేదని మండి పడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జీతాలు ఎనాడైనా పెండింగ్‌లో ఒక్కనెలైనా ఉన్నాయా అని నిలదీశారు. పౌష్టికాహారం లేక వసతిగహాలలో, కెజిబిలలో, గురుకులాలో చదివే విద్యార్ధినిలకు తీవ్రంగా రక్తహీన సమస్యలతో భాధపడుతున్నారని, నాణ్యమైన మెనూ ఇవ్వడం లేదని, నెలల తరబడి మెస్‌ ఛార్జీలు, బిల్లులు విడుదల చేయలేదని తక్షణమే మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచి అమలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్ధి వ్యతిరేక నూతన జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటిపైన భవిష్యత్తులో పోరాటాలకు విద్యార్థుల్లో ఐక్యం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, సునీల్‌ నాయక్‌, చందు, సోను నాయక్‌, గణేష్‌, చెన్నకేశవ, రాములు, సతీష్‌, ఇమ్రాన్‌, సేసి కుమార్‌, మహేష్‌ పాల్గొన్నారు.