కడప అర్బన్ : మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆంద్ర óప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కంచుపాటి తిరుపాలు, నగర అధ్యక్షులు సుంకర రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఇంజినీరింగ్ కార్మికులకు జీవో సంఖ్య 07 ప్రకారం రూ.18,500 ఇవ్వాలని, స్కిల్డ్,సెమి స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దా నం ప్రకారం పర్మినెంట్ చెయ్యాలని తెలి పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, సరెం డర్ లీవులు, ఎన్‌క్యాష్‌మెంట్ గడువు దాటినా ప్రభుత్వం సంబంధం లేనట్లు వ్యవహ రిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్-19 విపత్తులో పనిచేస్తూ మర ణించిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పేర్కొన్నారు. జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, కోవిడ్-19 అదనపు పారిశుధ్య కార్మికులను అప్కాస్ పరిధిలో చేర్చాలని, మరణించిన రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉపాధి కల్పించాలని కోరారు. పర్మినెంట్ కార్మికుల సంబంధించి జిపిఎఫ్‌్ ఖాతాలు తెరవాలని, పండుగ, జాతీయ సెలవు దినాలు వర్తింపజేయాలని అనేకసార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళి ్లనప్పటికీ పరిష్కరించడంలో విఫల మ య్యారని వాపోయారు. కార్మికులు, ఉద్యో గుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 24న పనులు నిలుపుదల చేసి చలో విజయవాడ కార్యక్ర మం నిర్వహి స్తున్నామని చెప్పారు. ఇప్ప టికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయ మైన డిమాండ్స్‌ని పరి ష్కారం చేసే దిశగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో రాబోవు రోజులలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహిం చవలసి వస్తుందని హెచ్చ రించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ఆనందరావు, నగర కమిటీ సభ్యులు సుంకర కిరణ, ఇమ్మానియేలు, ఆదాము, గార్లపాటి రవి, శివ పాల్గొన్నారు.
బద్వేలు : మున్సిపల్ కార్మికులకు ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బద్వేలు మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ టియు జిల్లా కార్యదర్శి కె. నాగేంద్ర బాబు యూనియన్ పట్టణ అధ్య క్షుడు పులి శ్యాం ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్య క్షులు దియ్యా లహరి, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, కోశాధికారి కాలువ శివకుమార్, కార్యదర్శి నాగరపు సత్తిరాజు, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్, పద్మిశెట్టి రామయ్య పాల్గొన్నారు.










