
పాచిపెంట: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎపిఎం జయకుమార్‌కు మండలంలోని విఒఎలు శుక్రవారం వినతిని పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విఒఎల సంఘం నాయకులు పి.జయలక్ష్మి, కె.ఝాన్సీ, సిహెచ్.హేమలత, కె.లక్ష్మి, కుమారి మాట్లాడుతూ రూ. 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, పనిభారం పెరుగుతున్నందున ప్రభుత్వమే మొబైల్ అధునాతనమైనవి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ కార్యకలాపాల్లో అంకితభావంతో పనిచేస్తున్న తమను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, అధిక సంఖ్యలో విఒఎలు పాల్గొన్నారు.