
ప్రజాశక్తి - మొగల్తూరు
విఒఎల విలీనాన్ని ఉపసంహరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్‌ఆర్ క్రాంతి పథం కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విఒఎల కాలపరిమితి సర్క్యూలర్‌ను రద్దుచేసి, సిబిఒహెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. వయసు పైబడిన వారికి అనారోగ్యంతో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించి జెండర్, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని కోరారు. అనంతరం ఎపిఎం సుభాషిణికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో రేపు విజయ, మేళం అంజలీదేవి, వాటాల వెంకటలక్ష్మి, దొడ్డ దుర్గ, దొంగ పార్వతి ఉన్నారు.