
కమిషనర్‌కు సమస్యలు వివరిస్తున్న కిశోర్
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పరిధిలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని జెసిఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ సోమవారం కందుకూరు మున్సిపాలిటీలో జరిగిన గ్రీవెన్స్‌లో కమిషనర్ మనోహర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కోటారెడ్డి క్లబ్ నుంచి ఆది ఆంధ్ర కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా ఉండటంతో ప్రయాణానికి అణువుగా లేదని తెలిపారు. త్వరితగతిన మరమ్మతులు చేయాలని కోరారు.