ప్రజాశక్తి - అరిలోవ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విశాఖ జిల్లా డిఇఒ కార్యాలయం వద్ద సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యాన జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తక్షణమే అక్రమ బదిలీలు నిలిపివేయాలని, బదిలీ అయిన ఉపాధ్యాయులకు జివిఎంసి, భీమిలీ పరిధిలో 14 మందికి జీతాలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధనకార్యదర్శి టిఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించకుంటే కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్.నాగమణి, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శిలు తదాన అప్పారావు, వైఆర్‌కె.ప్రసాద్, జిల్లా గౌరవాధ్యక్షులు అనకాపల్లి పైడిరాజు, సహాధ్యక్షులు రొంగలి ఉమాదేవి, కోశాధికారి కె.రాంబాబు, కార్యదర్శులు సామ రాజులు, చుక్క సత్యం, ఉప్పాడ రాము, రియాజ్ అహ్మద్, టి.జగన్, ఉషారాణి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










