Aug 10,2023 22:11

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు సమస్యలు పరిష్కరించాలని గురువారం తాడేపల్లిగూడెం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద డివిజనల్‌ కార్యదర్శి ఎం.రాధాకష్ణ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గ్రామీణ తపాల ఉద్యోగులకు 8 గంటల పని కల్పించాలని, పెన్షన్‌తో సహా అన్ని ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రూ.ఐదు లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కలుగజేయాలని, గ్రాడ్యుటీ రూ.ఐదు లక్షలకు పెంచాలని, పెయిడ్‌ లీవ్‌ను 180 రోజులకు నగదు సౌకర్యం కలుగు చేయాలన్నారు. దశలవారీ పోరాటంలో భాగంగా సెప్టెంబర్‌ 12వ తేదీన సర్కిల్‌ ఆఫీసుల ముందు ఒకరోజు నిరాహార దీక్ష, డిసెంబర్‌ 5వ తేదీ నుంచి నిరవదిక సమ్మె చేస్తామని రాధాకృష్ణ తెలిపారు. అనంతరం అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.