ప్రజాశక్తి - తిరువూరు : తమ సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో తిరువూరు. నగర పంచాయతీ కార్యాలయం ముం దు శుక్రవారం ధర్నా చేశారు. ఈసంద ర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరు వూరు నగర పంచాయతీ ఆధికారుల నిర్లక్ష్యానికి కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అన్ని నగర పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్ లలో పెండింగ్ లేకుండా హెల్త్ అలవెన్స్ లు ఇస్తుంటే తిరువూ రులో ఇవ్వకుండా కార్మికులను ఇబ్బం దులకు గురిచేస్తున్నారని ఆరోపించా రు. కార్మికుల వేతనాల నుండి ఈఎస్‌ఐ కింద తొమ్మిది సంవత్సరాల నుండి మినహాయింపు చేసుకుంటు న్నారే కానీ వారికి ఈఎస్‌ఐ కార్డులు ఇవ్వలేదన్నారు. క్యాజువల్ సెలవులు జీవో నెంబర్ 39 ప్రకారం సంవత్స రానికి 15 రోజులు ఉన్నప్పటికీ తిరు వూరులో ఉన్న అధికారులు వాటిని అమలు చేయడంలేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. వెట్టిచాకిరి చేయిం చుకుటున్న15 మంది కార్మికులకు నెలకు రూ.1500 నుండి 2000 మాత్రమే ఇస్తూ మిగిలిన సొమ్మును అధికారులు, పాలకవర్గ సభ్యులలో కొంతమంది పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించా లని, లేదంటే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చేపలమడుగు నాగరాజు, మోదుగు సురేష్, నాయకులు రమణ, పుల్లారా వు, సామ్రాజ్యం, నాగరాజు, సుందర రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










