నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు
సమస్యలు పరిష్కరించాలని నిరసన
ప్రజాశక్తి-నెల్లూరు:ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అసంబద్ధమైన ఉపాద్యాయుల సర్దుబాటును నిలుపుదల చేయాలంటూ విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఫ్యాఫ్టో సెక్రటరీ జనర్ చిట్టేటి రమేష్ మాట్లాడుతూ బదిలీలు, ఉద్యోగోన్నతులు జరిగి రెండు నెలలు పూర్తి కావస్తున్న వారికి ఇంతవరకు జీతాలు రాకపోవడం దారుణమన్నారు. అంతటితో ఆగకుండా మళ్లీ ఇప్పుడు అత్యవసరంగా ప్రభుత్వం ఉపాద్యాయుల సర్దుబాటు చేపట్టడం దుర్మార్గమైన చర్యలని ప్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ వి.వి.శేషులు పేర్కొన్నారు. ప్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ సి.హెచ్.హజరత్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకు వచ్చిన 117 జి.ఓ వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేస్తూ, బడుగు,బలహీన వర్గాల వారికి విద్యను దూరం చేయడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం ఉపాద్యాయుల సర్దుబాటు ను నిలుపుదల చేసి,బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన వారికి జితాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తరువాత డిఈఒ కార్యాలయ ఏడి నారాయణ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్యాప్టో కార్యవర్గ సభ్యులు యన్. దశరధ రాములు,చలపతి శర్మ, పిచ్చి బాబు, సి.హెచ్.చలపతి, నరసిం హులు, నవకోటేశ్వర రావు, పల్లం వేణుగోపాల్, ఆదినారాయణ, మాల్యాద్రి, జుల్ఫికర్ అలీ, పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.










