May 29,2023 23:36

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ కాకినాడలో సోమవారం జర్నలిస్టులు ధర్నా చేశారు. నిబంధనలు సడలించి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలనే తదితర డిమాండ్లతో డిపిఆర్‌ఒ కార్యాలయం వద్ద ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరంకలెక్టర్‌ కత్రికా శుక్లా, పౌర సంబంధాల శాఖ అధికారి నాగార్జునకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్‌ రాజ్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల డిమాండ్స్‌ డేను పురస్కరించుకుని 9 డిమాండ్లతో కూడిన వినతిపత్రం కలెక్టర్‌కు అందజేశామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు మున్ని, వీధి గోపీనాథ్‌, పుర్రె త్రినాధ్‌, వల్లూరి నానాజీ, లక్ష్మణ్‌, సురేంద్ర, దాసరి శ్రీనివాస్‌, రెడ్డి నాయుడు బాబు, పలివెల శ్రీనివాస్‌, రవి, హస్సేన్‌, మదన్‌, విజరు, సోనీ, వాసంశెట్టి శ్రీనివాస్‌, అప్సర, ప్రవీణ్‌, వాసు పాల్గొన్నారు.