మాట్లాడుతున్న నాయకులు
సమస్యలు పరిష్కరించాలని జీపుజాతా
ప్రజాశక్తి-మర్రిపాడు:డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యారంగ సమస్యలపై జిల్లాజీపు జాతయాత్ర గురువారం మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నందవరం మోడల్ స్కూల్ విద్యార్థులను సమావేశపరిచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, రమణ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలలో బాలికల హాస్టల్‌లో వార్డెన్ లేరని, మంచినీటి సమస్య వెంటాడుతుందని వారికి వివరించారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత ప్రస్తుత ధరలతో ఏమాత్రమూ సంబంధం లేకుండా అరకొర మెస్ ఛార్జీలను పెంచారన్నారు. కాస్మోటిక్ ఛార్జీలు పూర్తిగా ఇవ్వడం మరిచారని, రెగ్యులర్ సిబ్బంది లేక నాలుగు హాస్టల్స్ కు వార్డన్ లను ఇన్చార్జిలుగా నియమించి విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా మరిచారన్నారు. హాస్టల్లో తాగునీరు తలుపులు, కిటికీలు, స్నాన బోధలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. సమస్యల ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రహంతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు గౌరవరం శ్యామలమ్మ, మూలి ప్రమీల పాల్గొన్నారు.










