ప్రజాశక్తి-కాకినాడ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇపిఎఫ్ 1995 పెన్షనర్లు మంగళవారం స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జిల్లా అధ్యక్షులు కె.రమణమూర్తి అధ్యక్షతన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిఆర్‌పిఎ ఎపి రాష్ట్ర కోశాధికారి సిహెచ్.సత్యనారాయణరాజు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద కవర్ చేయబడిన పెన్షనర్లు, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లారుమెంట్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహ్సిఉ్తన్నారన్నారు. దేశంలో ఇపిఎఫ్ పింఛనుదారులు ఆర్థిక, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపిఎఫ్ 95 పించన్‌దారులు 75 లక్షలకు పైగా దేశంలో ఉండగా, 2 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారన్నారు. తమ నెలవారీ పెన్షన్‌ను రూ.500 నుండి రూ.3500 మాత్రమే అన్నారు. అది కూడా సెప్టెంబరు, 2014 నుండి ఎటువంటి మెరుగుదల లేదన్నారు. వృద్ధాప్యంలో మనుగడ కోసం సరైన ఆహారం, ఔషధాల కోసం చాలా ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రాష్ట్ర కోశాదికారి సి.హెచ్.సత్యనారాయణరాజు శిభిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇ.పి.ఎస్.పెన్షనర్ల సమస్యలు పట్ల కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ముఖ్య మంత్రులు విజ్ఞప్తులు పెడచెవిన పెట్టి బాధ్యతా రహితంగా ఆర్ధిక లేమి పేరుతో తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇ.పి.ఎస్.పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఆర్.టి.సి.రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం అధ్యక్షులు ఒ.రాంబాబు, ప్రధాన కార్యదర్శి వై.త్రిమూర్తులు, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడారు. ఆర్.టి.సి.పెన్షన్ సంఘం నాయకులు డిఆర్.మోహనరావు, పి.ఎస్.నారాయణ, వైఎస్.నారాయణ, జిల్లా కార్యదర్శులు జోగా అప్పారావు, యుఎస్‌ఎన్.రెడ్డి, కర్రి బాబూరావు, బార్నబాస్, సాయిబాబు, కాశీవిశ్వనాద్, నారాయణరావు, మోహనమురళి, బొజ్జా అశోక్, ఎం.రామకృష్ణ, జి.రామకృష్ణ, వి.రమణ పాల్గొన్నారు.










