Aug 14,2023 18:43

ధర్నా చేస్తున్న దృశ్యం

ధర్నా చేస్తున్న దృశ్యం
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ప్రజాశక్తి -నెల్లూరు :స్థానిక 25 డివిజన్‌ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రూరల్‌ కార్యదర్శి వర్గ సభ్యులు కొండ ప్రసాద్‌ మాట్లాడుతూ25 డివిజన్‌ బుజబుజ నెల్లూరు రేషన్‌ కార్డులు రానివారు, వద్ధాప్య పింఛన్‌, వికలాంగుల పింఛన్‌, వితంతు పెన్షన్‌ రానివారు, ఇంటి స్థలం లేని వారు అనేక మంది ఉన్నారన్నారు. టిడ్కో ఇల్లు వచ్చినవారికి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు
.కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు నర్సారెడ్డి. ఎ. మోహన్‌. ఎస్‌.వెంకయ్య. కె.కష్ణమూర్తి. టి.శ్రీనివాసులు. పి. పుల్లయ్య. బి.రవి. తదితరులు పాల్గొన్నారు.