
ప్రజాశక్తి - మొగల్తూరు
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడలో సామూహిక ధర్నా చేపట్టనున్నామని సిడిపిఒ ఊర్మిలకు గురువారం అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ మినీ వర్కర్స్ హెల్పర్స్‌కు కనీస వేతనాలు చెల్లించాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌శాడీలకు గ్రాడ్యూటీ అమలు చేయాలని కోరుతూ ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి జి.పెద్దింట్లు, ఎ.సీతారత్నం, సారమ్మ, పద్మావతి, జ్యోతి, మేరీ, ధనలక్ష్మి, జీవనకుమారి పాల్గొన్నారు.