Jan 24,2023 21:45

ప్రజాశక్తి - ఏలూరు
           తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు మంగళవారం స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా నాయకులు పి.హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు ఐదు లక్షలు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, వేతనంలో సగభాగం పెన్షన్‌గా ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు టి.రజిని, సిహెచ్‌.ఆందోళనమ్మ, జి.విజయలక్ష్మి, వి.కనకదుర్గ, వెంకటలక్ష్మి, టి.సుకన్య, వి.వెంకటరమణ, జైనాబి తదితరులు పాల్గొన్నారు.
కైకలూరు రూరల్‌: స్థానిక సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, జిఒ నెం.1ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐసిడిఎస్‌ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కూరెళ్ల లాజరు, పి.సుజాత, జి.జ్యోతిరాణి, బిడి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
గణపవరం: అంగన్వాడీ కార్యకర్తలకు ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని అంగన్వాడీలు మంగళవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఏలూరు జిల్లా అధ్యక్షురాలు ఎమ్‌డి.హసీనాబేగం, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లకు గ్రామాల్లో నెట్‌ సౌకర్యం లేకపోవడంతో పనిచేయడం లేదన్నారు. రకరకాల యాప్‌లు తీసుకొచ్చి పని భారం పెంచారని, వేతనం పెంచడం లేదని విమర్శించారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ తులసికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు బి.రామకోటి, జయలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
చింతలపూడి: పెండింగులో ఉన్న టిఎ, డిఎ బకాయిలను విడుదల చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని అంగన్వాడీ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు పి.సరోజిని, పి.మాణిక్యం డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బిజెఎన్‌.కుమారి, బి.ఫణివర్ధిని, కవిత, అరుణ, మార్తమ్మ, హేమలత, పాప రత్నం, జి.సరళ పద్మావతి, పద్మ పాల్గొన్నారు.
కుక్కునూరు: అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించి బకాయి వేతనాలు విడుదల చేయాలని సిఐటియు మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌ మాట్లాడారు. ధర్నాలో అంగన్వాడీలు రాయి రమణ, నాగలక్ష్మి, కణితి మంగ, విమల, జయ, జయసుధ, విజయ, రూపాలత, అలివేలు, అన్నపూర్ణ, నాగమణి, ఝాన్సీ, సౌజన్య పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి, జీలుగుమిల్లి మండల కార్యదర్శి సిహెచ్‌.కొండలరావు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యుడిసి కృష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృపామణి, తెల్లం రామలక్ష్మి, కె.పుష్ప, నూర్జహాన్‌, అంగన్వాడీలు పాల్గొన్నారు.