May 10,2023 22:46

నోడల్‌ అధికారి సరితాదేవికి వినతి పత్రం ఇస్తున్న 104 ఉద్యోగ సంఘాల నాయకుల


ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో ఎపి 104 సేవలలో పనిచేస్తున్న ఉద్యోగులు కాకినాడ డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ నోడల్‌ అధికారి పి.సరితా దేవిని కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు.104 లో పని చేస్తున్న ఉద్యోగులకు 3 నెలల జీతాలు పడలేదని, ముఖ్యమంత్రి హామీ మేరకు 104లో పనిచేస్తున్న డ్రైవర్‌, డిఇఒలను ఔట్‌ సోర్సింగ్‌లో కలపాలని, అరబిందో యాజమాన్యం ఉద్యోగుల నుండి పిఎఫ్‌ అక్రమంగా వసూలు చేస్తోందని తెలిపారు.
దీనిపై నోడల్‌ అధికారి పి సరితా దేవీ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తమకు న్యాయం చేసే వరకు పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తామని ఉద్యోగులు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎపి 104ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.శ్రీకాంత్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటరావు కోశాధికారి సి.హెచ్‌ శ్రీను, ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు.