May 08,2023 21:40

ప్రజాశక్తి - ముదినేపల్లి
             గత 25 ఏళ్లుగా వణుదుర్రు గ్రామంలో దళితులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కారించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్నం మాధవ ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ను కోరారు. ఈ మేరకు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావును సోమవారం కైకలూరులోని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు లేవని, మంచినీరు, డ్రెయినేజీ సమస్యలతో పాటు శ్మశానవాటికకు స్తంభాలు ఏర్పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కొత్తపల్లి నుంచి వణుదుర్రు, దేవపూడి వరకు రోడ్ల వెంబడి విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలోని మెట్ల రేవును అభివృద్ధి చేయాలని, నడవడానికి వంతెన సౌకర్యం ఏర్పాటు, ప్రజలు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలని డిఎన్‌ఆర్‌ను కోరారు. సమస్యలపై డిఎన్‌ఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు మాధవ తెలిపారు. మాధవతో పాటు బొడ్డు సురేష్‌ ఉన్నారు.