Sep 12,2023 22:07

మున్సిపల్‌ మేనేజర్‌కు వినతిని ఇస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో పారిశుధ్యకార్మికులు ర్యాలీ నిర్వహించి, మున్సిపల్‌ మేనేజర్‌ సుధాకర్‌కు వినతిని ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పురపాలక సంఘంలో అదనపు కార్మికులుగా తీసుకున్న వారికి గత రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదన్నారు. వీరితో పాటు క్లాప్‌ ఆటో డ్రైవర్లకు ఐదు నెలల నుంచి వేతనాలు అందలేదన్నారు. ప్రతి నెల వేతనాలు అందక పోతే కార్మికులు వారి కుటుంబాలకు ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ సమస్యలను పరిష్కరించాలన్నారు. 60 సంవత్సరాల పేరుతో తొలగించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఈ సమస్యలపై విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున పోరాటాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి పి జగదీష్‌, కోశాధికారి ఆనంద్‌, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, రామచంద్రప్ప, రామంజప్ప, సహాయ కార్యదర్శులు చంద్ర, మంజునాథ్‌, మూర్తి, గురునాథ్‌, కమిటీ సభ్యులు కుమార్‌, నారాయణమూర్తి, గంగప్ప, కృష్ణమూర్తి, రమేషు, శంకర, బాబయ్య, ఏ నాగేంద్ర, బాలాజీ, కవితమ్మ, గంగ రత్నమ్మ, శోభమ్మ, ఓబులమ్మ, సుబ్బలమ్మ తదితరులు పాల్గొన్నారు.