Sep 27,2023 22:58

ప్రజాశక్తి-గుడివాడ : ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారంతో పాటు వారిలో సంతప్తిస్థాయి పెంపొంది ంచేందుకు ప్రభుత్వం జగనన్నకు చెబుదాం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం నందివాడ మండలంలోని కొండపల్లి కన్వెన్షన్‌లో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజత సింగ్‌, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు కలెక్టరేట్‌ వరకు రాకుండా మండలంలోనే అధికారులతో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లాలో ప్రతి బుధవారం, శుక్రవారం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఇప్పటివరకు ఉంగుటూరు, కోడూరు, మొవ్వ మండలాల్లో జెకెసి నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, ఇదివరకు పెండింగ్లో ఉన్నవి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, అర్జీదారులతో మాట్లాడలన్నారు. నేడు నిర్వహించిన కార్యక్రమంలో 33 అర్జీలు అందాయని, మండల పరిధిలో భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు అందాయన్నారు. తొలుత జిల్లా కలెక్టర్‌ స్థానిక జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో ఉపాధి హామీ పథకం కింద 12 అడుగుల విస్తీర్ణంలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం పనులు ప్రారంభించారు. అనంతరంఉచిత వైద్య శిబిరం, ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో సంపూర్ణ పోషణ మాసోత్సవ శిబిరం, డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్వాక్రా ఉత్పత్తుల శిబిరాలను సదర్శంచారు ఈ కార్యక్ర మంలో డిఆర్‌ఓ వెంకటరమణ, ఆర్డీవో పద్మావతి, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డి ఆర్‌ డి ఏ పిడి పిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఐసిడిఎస్‌ పిడి ఎస్‌ సువర్ణ, డి ఎం అండ్‌ హెచ్‌ ఓ డాక్టర్‌ జి.గీతాబాయి, డీఎస్‌ఓ పార్వతి పాల్గొన్నారు.