ప్రజాశక్తి - కురుపాం : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్‌ఎల న్యాయపరమైన సమస్యలైన పేస్కేల్, కనీసవేతనం రూ.26వేలు చెల్లించాలని, నామిని విఆర్‌ఎలను విఆర్‌ఎలుగా గుర్తించి, అర్హులను విఆర్‌ఒ, అటెండర్, వాచ్ మాన్, డ్రైవర్ ) ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. డిఎతో కూడిన వేతనం చెల్లించి, 65 ఏళ్లు దాటి మరణించిన కుటుంబంలో కాంపాసినెట్ కింద ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ఈ సమస్యలపై ఆగస్టు 7,8 తేదీల్లో కలెక్టరేట్ వద్ద చేపట్టబోయే దీక్షలకు విఆర్‌ఎలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘ జిల్లా అధ్యక్షులు జి.ఈశ్వరరావు మండలంలో గల విఆర్‌ఎలు పాల్గొన్నారు .
సీతానగరం : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎపి గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జి. వెంకటరమణ మాట్లాడారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వడ్డీ సూరయ్య, బి జోగులు, విఆర్‌ఎలు తోట నాగయ్య, లక్ష్ము, చిట్టెమ్మ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : దీర్ఘకాలంంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఎల రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మండంగి ఆదినారాయణ మాట్లాడుతూ విఆర్‌ఎల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలంలోని విఆర్‌ఎలంతా పాల్గొన్నారు.
సాలూరు:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఆర్‌ఎలు గురువారం నిరాహారదీక్షలు చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, విఆర్‌ఎల సంఘం నాయకులు పాపారావు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన దీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం నాయకులు మోహనరావు, రాములమ్మ పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము విఆర్‌ఎల సమస్యలను పరిష్కరించని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తారని హెచ్చరించారు. దీక్షలకు ప్రభుత్వం స్పందించకపోతే చలో కలెక్టరేట్ చలో అసెంబ్లీ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్.గోపి, బి.రామయ్య, ఆర్. ప్రసాదు, డి.పారమ్మ, పార్వతమ్మ, ఎండమ్మ తదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట : సమస్యలు పరిష్కారం కోరుతూ విఆర్‌ఎలు స్థానిక తహశీల్దార్ రిలేనిరాహారదీక్షలు జరిగాయి. ఈ దీక్షలను ఉద్దేశించి విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు టి బాబూరావు మాట్లాడుతూ విఆర్‌ఎఒ సంఘం సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు రామయ్య, శ్రీను, సుధ, నారాయుడు, జ్యోతి, తదితరలు పాల్గొన్నారు










