తుళ్లూరు: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సోమవారం రాజ ధాని ప్రాంతంలో పర్యటించారు. స్థానిక వైసిపి నాయ కులతో కలిసి వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి సమీ పంలో నూతనంగా నిర్మించిన వీరభద్రస్వామి గుడికి వెళ్లారు. కొంతమంది రైతులు ఆయనను కలిశారు. తాము రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని, దీక్షా శిబిరంలోకి వచ్చి సమస్యలు వినాలని కోరారు. మరోసారి వింటానని రాయుడు అనడంతో, రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు వినకపోయినా తమకు మద్దతు ఇవ్వాలని రైతులు కోరగా, మరోసారి వస్తానంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెలగపూడితో పాటు ఐనవోలు,మందడం గ్రామాల్లో రాయుడు పర్యటించారు. ఐనవోలులో గ్రామ వైసిపి అధ్యక్షులు పాలకాయల శేషగిరి ఇంటిలో అల్పాహారం తీసుకొని కార్యకర్తలతో ఫోటోలు దిగారు. వెలగపూడిలో బి ఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందడం జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యా బోధన, కనీస సౌకర్యాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. రాయుడును చూసేందుకు యువకులు ఆసక్తి కనబరిచారు.యువకుల కోరిక మేరకు కొద్ది సేపు క్రికెట్ ఆడారు.










