Oct 11,2023 23:55

సమస్యలపరిష్కారానికే అధిక ప్రాధాన్యత


సమస్యలపరిష్కారానికే అధిక ప్రాధాన్యత
ప్రజాశక్తి- కార్వేటినగరం: ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ లతబాలాజీ అధికారులను ఆదేశి ంచారు. బుధవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లా డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో ప్రజల అభ్యర్థనలు 80శాతం పరిష్క రించగా మరో 20శాతం నవంబరు లోపు పరిష్కరించాలన్నారు. మంజూరైన ఇరిగేషన్‌ పనులను ఏఈ రవిప్రకాష్‌ వివరించారు. మండలంలో రూ.13కోట్లతో మంజూరైన నాడునేడు పనుల పురోగతిని తెలియజేశారు. గ్రామాల్లో ఇనుప స్థంబాల స్థానంలో సిమెంటు స్థంబాలను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ ఏఈ రియాజ్‌ని ఎంపిపి ఆదే శించారు. అనంతరం ఎంపిడిఒ మోహ నమురళి మాట్లాడుతూ జగనన్న గృహాలను త్వరితన పూర్తి చేయాని సూచించారు. ఉపాధిహామీ, అంగన్వాడీ, వెట ర్నరి శాఖలకు సంబందించిన అభివద్ధి పనుల ను వివరిం చారు. గైర్హాజరైన వివిద శాఖ అధికా రులపై ఎంపిపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోఆప్షన్‌ సభ్యులు ప్రభాకర్రెడ్డి, సింగి ల్‌ విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ఏపీఓ జా హ్నవి, ఎపిఎం విజయకుమార్‌, డిటి లీలా వతి, అధికారులు పాల్గొన్నారు.