ప్రజాశక్తి-కొయ్యూరు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు కొయ్యురు మండల కమిటీ ఆధ్వర్యాన వెలుగు యానిమేటర్స్ (విఒఎ) సోమవారం వెలుగు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు వై.అప్పలనాయుడు, విఓఏల నాయకులు కె.మల్లేష్ మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రేడింగ్ పేరుతో జీతాలు వేతనాల్లో కోత, వేధింపులు ఆపాలని, 15 సంఘాలు లోవు ఉన్న విఒఎల వేతనాలు విడుదల చేయాలి, ఉపాధికి నష్టం కలిగించే విఒఎల మెర్జ్ ఆపాలి, గ్రామ సంఘం తీర్మానం లేకుండా తొలగించిన విఒఎలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, అధికారుల వేధింపులు ఒత్తిళ్లుఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివోఏ నాయకులు కుమారి, భవాని, రూపా, శోభన్, రమణ, చిన్ని కృష్ణ, గిరిజన సంఘం నాయకులు ఎస్.సూరిబాబు, విఓఏలు పాల్గొన్నారు.










