Jul 27,2023 22:57

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ తమ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌ ఉద్యోగులు ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. వచ్చే నెల 10 నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగుల జెఎసి చైర్మన్‌ వి.బాల కుమార్‌ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ఉద్యోగులు, కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అనేక మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఎన్‌.ఆదినారాయణరావు, వై శ్రీనివాసరావు, జివిఎల్‌.శ్రీనివాస్‌, ఎల్‌.గంగాధరరావు, జి.శ్రీనివాస్‌, అప్పారావు పాల్గొన్నారు.