ప్రజాశక్తి- గజపతినగరం : మండ లంలోని మరుపల్లి గ్రామంలో ఎపి మోడల్ స్కూల్ విద్యార్తులు పలు సమస్యలపై శనివారం నిరసన తెలిపారు. పాఠశాల బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె. జగదీష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పురుగులతో ఉందని మరుగుదొడ్లు లేవని, రన్నింగ్ వాటర్ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎన్నిసార్లు సంబంధిత ప్రిన్సిపల్‌కు చెప్పినా ఫలితం లేదన్నారు. అనంతరం సమస్యల పట్ల స్థానిక సచివాలయ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చారు. క్రీడా మైదానం కోసం విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని మండల అధికారులు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమేష్, సోమేష్, వెంకటరమణ, సంధ్య, శివ, విద్యార్థులు పాల్గొన్నారు.










