ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
ఎపి జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద జిల్లా నుంచి ఉద్యోగులు పాల్గొని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఫ్యాప్టో జిల్లా కమిటీ చైర్మన్, ఎపి జెఎసి జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్ మాట్లాడుతూ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని,11వ పిఆర్‌సి ప్రతి పాదించిన స్కేల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. కరప తహశీల్దార్ కార్యాల యం వద్ద వ ఎపిజెఇఎ జిల్లా అధ్యక్షులు కే చంద్రశేఖర్ కార్యదర్శి కె రాజగోపాలరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలకు జిల్లా కార్యదర్శి డాక్టర్ వీరయ్య,, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ మద్దతు తెలిపారు.
కాకినాడ ధర్నాచౌక్ వద్ద రిలే దీక్షలు చేపట్టిన ఎపి జెఎసి ఉద్యోగులు










