కడప అర్బన్ : విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరి ష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదని ఏపీటీఎఫ్(257) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.శ్యామ్ సుందర్ రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా, ఎస్టీయూ రాష్ట్ర ఆదనపు ప్రధాన కార్యదర్శి కె.బాలగంగిరెడ్డి హెచ్చరించారు. ఆది వారం యుటిఎఫ్ భవన్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్ అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. వాటిని నమ్మి అధికారంలోకి రావడానికి సహకరిస్తే, పూర్తిగా విస్మరించారని వాపోయారు. . నాలుగేళ్లు పరిపాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదన్నారు. ఉద్యోగులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. 11వ పిఆర్‌సి బకాయిలతోపాటు, ఏడు డిఎ బకా యిలను కూడా చెల్లించలేదని ఆరోపించారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి పాఠశాలల పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యా యులను, విద్యాశా ఖాధికారులను భయభ్రాంతులను చేయడం తగద న్నారు. ముఖ్య కార్యదర్శి దూకుడును ప్రభుత్వం నిలువరించాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాప్టో కడప జిల్లా చైర్మన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 ను జారీ చేసి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. పాఠశాల విలీనం పేరుతో ప్రాథమిక విద్యను ధ్వంసం చేశారని ఆరోపించారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5400 ప్రాథమిక పాఠశాలను విలీనం చేశారన్నారు. జీవోను అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలలలో 20వేల పాఠశాలను డీగ్రేడ్ చేయడం కానీ మూసి వేయడం కానీ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగ న్మోహన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ ప్రాథమిక విద్యకు సమాధి కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. జూలై 2023 నుండి అమలు చేయాల్సిన 12వ పిఆర్‌నితక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పి.రమ ణారెడ్డి, ఏపీటీఎఫ్(1938) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్.అబ్దుల్లా, యుటిఎఫ్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు, అన్న మయ్య జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.హరి ప్రసాద్, ఎస్.జాబీర్, ప్రధానో పాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.వెంకటసుబ్బారెడ్డి, ట్రెజరర్ రాజశేఖర్, ఏపీటీఎఫ్(257) జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.భాస్కర్ రెడ్డి, నాగ రాజు, బిటిఏ జిల్లా అధ్యక్షులు హరి కొండయ్య పాల్గొన్నారు.










