ప్రజాశక్తి -నక్కపల్లి : గ్రామ సచివాలయ, వార్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకట రామిరెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు నక్కపల్లి మండలం గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కంబాల రాజు తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన జిల్లా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరామిరెడ్డి దృష్టికి గ్రామ వార్డు , సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు , ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల హెల్త్ కార్డు, తదితర సమస్యలను తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ, .ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా వెంకటరామిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో నక్కపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ జీనాథ్ ఆమెన్, గొల్లపల్లి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ కారే శేఖర్, ట్రెజరర్ చందా కొండలరావు, పైడిరాజు, జాయింట్ సెక్రటరీ పద్మజ , కార్యవర్గ సభ్యులు పందిరి వెంకటేష్, కాండ్రకోట రమణమ్మ పాల్గొన్నారు.










