Feb 21,2023 21:04

ప్రచారం చేస్తున్న ప్రజా సంఘాలు

సమస్యలపై పోరాడే పోతుల నాగరాజుని గెలిపించండి : ప్రజా సంఘాలు

ప్రజాశక్తి - కొత్తపల్లి

సమస్యలపైన నిరంతరం పోరాడే పోతుల నాగరాజు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి చేస్తున్నారని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఏపీ వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, పూర్వపు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొల్లు ప్రసాద్‌ బాబు యాదవ్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ పట్టభద్రులను కోరారు. మంగళ వారం మండలంలోని గోకవరం లింగాపురం బట్టు వారి పల్లి గుమ్మడ పురం తదితర గ్రామాలలో పోతుల నాగరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతుడైన పోతుల నాగరాజు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి సామాజిక సేవకే అంకితమయ్యారు.
బండి ఆత్మకూర్‌ : ఎమ్మెల్సీగా డాక్టర్‌ పోతుల నాగరాజును గెలిపిం చాలని కోరుతూ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ రత్నమ య్య, వ్యకాసం కార్యదర్శి డేవిడ్‌, అధ్యక్షుడు సుబ్బ రాయుడు ఆధ్వర్యంలో ఈర్నపాడు గ్రామంలో సిపిఎం ఉమ్మడి జిల్లా సీనియర్‌ నాయకుడు బాల హుస్సేన్‌తో కలిసి ప్రచారం చేశారు. అనంతరం గ్రామంలోని గ్రామ సచివాలయం, జడ్పి ఉన్నత పాఠశాలలో పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా నాయకులు ఏసేపు, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాజేష్‌, జన విజ్ఞాన వేదిక నాయకులు గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.