Oct 01,2022 23:27

గాజువాక జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న వెంకటరెడ్డి

ప్రజాశక్తి -గాజువాక : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన పారిశుధ్య కార్మికుల శనివారం గాజువాక జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య తగ్గి, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగిందన్నారు. వీరికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. సేఫ్టీ పరికరాలు, మాస్కులు, సబ్బులు ఇవ్వడం లేదన్నారు. పనిముట్లు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు వారి డబ్బులతో చీపుర్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ ధర్నాలో ఎం.నాగరాజు, రాజు, కార్మికులు పాల్గొన్నారు.